తెలిసి పలికినా తెలియక పలికినా రామనామం రక్షిస్తుంది
శ్రీరామనామము అత్యంత మహిమాన్వితమైనది. సకల పాతకాలను
రూపుమాపి భవబంధాలను తొలగించగల తారకమంత్రము. కలియుగంలో మానవులు తరించగల మార్గము. ‘రా’ అంటే మన పెదవులు
విడివడి మనలోని పాపాలన్నీ బయటకుపోయి ‘మ’ అన్నప్పుడు పెదవులు మూసుకుని తిరిగి వాటిని
లోపలికిపోకుండా చేస్తుంది. రామనామ జపం సకలార్థ సాధనం, మోక్షప్రదాయం.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
‘‘రామ రామ రామ అని
మూడుసార్లు ఉచ్ఛరిస్తే విష్ణు సహస్ర నామ పారాయణ చేసినంత ఫలం’’ అని శివుడు
పార్వతీదేవికి చెప్పాడు.
శ్రీరామ నామాన్ని నిరంతరం జపించటం వలన శత్రుపీడలు, సకల రోగాలు
తొలగిపోయి సుఖశాంతులతో జీవించగలుగుతారు.
‘శ్రీరామరక్ష సర్వ
జగద్రక్ష!’- తెలిసి పలికినా
తెలియక పలికినా రామనామం రక్షిస్తుంది. చంటి పిల్లలకు స్నానం చేయించాక చివరలో ‘శ్రీరామరక్ష’ పెట్టటం
తల్లులందరికీ అలవాటు. ఏ కష్టం కలిగినా ‘శ్రీరామచంద్రా! నీవే దిక్కు’ అని అనుకోవటం
అనాది నుండి వస్తున్న ఆనవాయితీ! తుమ్మినా ‘రామచంద్రా!’, క్రింద పడినా ‘రామచంద్రా!’, ఆకలి వేసినా ‘అన్నమో
రామచంద్రా!’ అంటూ ఉండే
సామాన్య జనులకు కూడా అండదండగా ఉండి ఆదుకుని కాపాడేది రామనామమే!
శ్రీరాముని కంటె కూడా రామ నామము అంతటి మహిమాన్వితమైనది. ‘శ్రీరామ’ వ్రాయబడకుండా
ఎట్టి వ్రాతయు వ్రాయబడకుండుగాక! అని శ్రీరామ పట్ట్భాషేక సమయంలో వశిష్ఠుడు మొదలైన
ఋషులు కీర్తించారు.
1 Comments
Jai Shree Ram
ReplyDeleteDear viewer Please donot enter any spam links