భగవంతుడు ఓంకారము
మరియు 'అథ' అని పలికిన తరువాత ప్రపంచాన్ని సృష్టించడం
ఆరంభించాడని చెప్ప బడుతుంది. కాబట్టే మనం
తలపెట్టే ఏ పని ఆరంభము లోనయినా ఓంకార నాదము శుభ సూచకంగా పరిగణించ బడుతుంది.
ఓంకారనాదము
చేసినప్పుడు వచ్చే శబ్దము గంట యొక్క ప్రతిధ్వనిని పోలి ఉండాలి (ఓంooooo...మ్ మ్) అది మనసుని శాంతింపచేసి పరిపూర్ణమైన
సూక్ష్మమైన శబ్దంతో సంధింప జేస్తుంది.
మానవులు దాని అర్ధంపైన ధ్యానం చేసి ఆత్మానుభవాన్ని పొందుతారు.
ఓంకారం వేర్వేరు
ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా వ్రాయ బడుతుంది.
సర్వ సాధారణమైన ఓం ఆకారము గణేశుడికి చిహ్నముగా ఉంటుంది. పైన ఉన్న వంపు తల, క్రిందగా ఉన్న పెద్ద వంపు పొట్ట ప్రక్కగా
ఉన్నది తొండము మరియు చుక్కతో ఉన్న అర్ధచంద్రాకారము గణేశ భగవానుడి చేతిలో ఉన్న
మోదకము.
ఈ విధముగా ఓంకారము జీవనగమ్యం, సాధన, ప్రపంచము దాని వెనుక ఉన్న సత్యము భౌతికము
అభౌతికము సాకార-నిర్వికారములు అన్నింటిని తెలియబరుస్తుంది.
0 Comments
Dear viewer Please donot enter any spam links