dwaraka tirumala |
స్వయంభువు ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం
స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి..పెద్ద తిరుపతి కి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకోలేని వారు ఈ చిన్న తిరుపతి లో తీర్చుకుంటే స్వామి దయతో అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.
ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. ఇది విజయవాడ నగరానికి 98 కి.మీ. దూరంలోను, రాజమండ్రి నగరానికి 75 కి.మీ. ఏలూరు నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న పుణ్య క్షేత్రము. ద్వారకా తిరుమల క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రాచీన క్షేత్రముగా చెప్పబడుతుంది. ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. స్వయంభూవుగా ప్రత్యెక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీద ఈ ప్రదేశమునకు ద్వారకా తిరుమల అన్న పేరు వచ్చింది. భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలోకి ఇక్కడున్న ఆలయం భిన్నంగా ఉంటుంది. దేవాలయానికి ఉత్తరాన పంపా నది ప్రవహిస్తుంది. ఈ దేవాలయం ఉభయ గోదావరి జిల్లా తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చిన్న తిరుపతి గా ప్రసిద్ధికెక్కింది. తిరుమల తిరుపతి(పెద్ద తిరుపతి) లో స్వామి వారికి మొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతి లో తీర్చుకున్నా అదే ఫలితం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతి లో మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి అని భక్తులు, స్థానికుల నమ్మకం. మరి చిన్న తిరుపతిలో సందర్శించవలసిన ప్రదేశాలను
0 Comments
Dear viewer Please donot enter any spam links