ప్రతి ఏడాది తిరుమలలో రథసప్తమి ఘనంగా నిర్వహించబడుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా రథసప్తమిని ఘనంగా జరుపబోతుంది తిరుపతి తిరుమల దేవస్థానం.
ఈ సంవత్సరం జనవరి 28వ తేదీన జరిగే రథసప్తమి గురించి కొన్ని వివరాలు కింద ఇవ్వబడినవి గమనించగలరు
జనవరి 28న తిరుమలలో రథసప్తమి ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం
సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
వాహనసేవల వివరాలు :
ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) - సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు -
చంద్రప్రభ వాహనం
ఆర్జిత సేవలు రద్దు :
ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
0 Comments
Dear viewer Please donot enter any spam links